బెల్లంకొండ సురేష్ చిన్న కొడుకు, హీరో బెల్లంకొండ సాయి శ్రీనివాస్ తమ్ముడు బెల్లంకొండ గణేష్ హీరోగా పరిచయం కాబోతున్నారు. ఆ కొత్త సినిమాకు సంబంధించి టైటిల్ తో పాటు ఫస్ట్ లుక్ ను చిత్ర యూనిట్ రిలీజ్ చేసింది. సితార ఎంటర్టైన్ మెంట్స్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి లక్ష్మణ్ దర్శకత్వం వహిస్తున్నారు.
ఇక ఈ సినిమాకు స్వాతిముత్యం అనే టైటిల్ ను ఫిక్స్ చేశారు. అలాగే ఈ సినిమాలో వర్ష బొల్లమ్మ హీరోయిన్ గా నటిస్తోంది. మహతి స్వర సాగర్ సంగీతం అందిస్తున్నారు. సూర్యదేవర నాగ వంశీ ఈ సినిమాను నిర్మిస్తున్నారు. గతంలో స్వాతిముత్యం టైటిల్ తో కమల్ హాసన్ హీరోగా కె.విశ్వనాధ్ దర్శకత్వంలో వచ్చిన సినిమా సూపర్ డూపర్ హిట్ అయిన సంగతి తెలిసిందే.