సంతోష్ శ్రీనివాస్ దర్శకత్వంలో బెల్లంకొండ శ్రీనివాస్ హీరోగా ప్రేక్షకుల ముందుకు రాబోతున్న చిత్రం అల్లుడు అదుర్స్. సుమంత్ ప్రొడక్షన్స్ మూవీ బ్యానర్ పై సుబ్రహ్మణ్యం గొర్రెల ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. పక్కా ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా రూపొందుతున్న ఈ చిత్ర షూటింగ్ ప్రస్తుతం ముగింపు దశకు చేరుకుంది. కాగా ఈ సంక్రాంతికి అల్లుడు అదుర్స్ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకు రావడానికి చిత్ర యూనిట్ ప్లాన్ చేసుకుంది. సంక్రాంతి కానుకగా జనవరి 15న ఈ చిత్రాన్ని విడుదల చేయబోతున్నట్లు అధికారికంగా ప్రకటించింది.
ఇక ఈ సినిమాలో బెల్లంకొండ సాయి శ్రీనివాస్ సరసన నభా నటేష్, అను ఇమ్మాన్యుయేల్ హీరోయిన్స్ గా నటిస్తున్నారు. ప్రకాష్ రాజ్, సోనూసూద్, వెన్నెల కిషోర్, సత్య కీలక పాత్రలో నటిస్తున్నారు.