దర్శకధీరుడు రాజమౌళి దర్శకత్వంలో యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా వచ్చిన చత్రపతి సినిమా ఎంతటి ఘన విజయం సాధించిందో కొత్తగా చెప్పనవసరం లేదు. నటుడిగా ప్రభాస్ కు ఈ సినిమా ఒక అడుగు పైకి లేపిందనే చెప్పాలి. అయితే ఈ సినిమాను బాలీవుడ్ లో బెల్లంకొండ శ్రీనివాస్ రీమేక్ చేస్తున్నాడు.
ఇక ఈ చిత్రానికి సాహో దర్శకుడు సుజీత్ ని దర్శకుడిగా ఎంచుకున్నట్టు సమాచారం. సుజీత్ కూడా చిత్రంతో బాలీవుడ్ లో కూడా మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. ఈ నేపథ్యంలో సుజిత్ అయితే ఈ సినిమాకు హైప్ వస్తుందని ఆయనను ఎంచుకున్నట్టు చెబుతున్నారు. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు త్వరలో వెల్లడి కానున్నాయి.