బోయపాటి శ్రీను దర్శకత్వంలో బెల్లంకొండ శ్రీనివాస్, రకుల్ ప్రీత్ సింగ్ హీరోహీరోయిన్లుగా నటించిన యాక్షన్ ఎంటర్టైనర్ జయజానకి నాయక సినిమా తెలుగులో భారీవిజయాన్ని అందుకోలేకపోయింది.
కానీ ఓ మోస్తరు విజయాన్ని సాధించింది. నటుడుగా బెల్లంకొండ శ్రీనివాస్ ను ఓ అడుగు ముందుకు వేసేలా చేసింది. అయితే యాక్షన్ సీన్స్ మాత్రం బోయపాటి ఎప్పటిలాగే ఇరగదీశాడు.
ఇక ఈ సినిమా యూట్యూబ్ లో హిందీ వర్షన్ అందుబాటులో ఉంది. జయజానకి సినిమా హిందీ వర్షన్ కు మాత్రం చాలా గొప్ప రెస్పాన్స్ వచ్చింది. ప్రస్తుతం ట్రెండింగ్ లో ఉన్న ఈ సినిమా తాజాగా ప్రపంచ రికార్డు సాధించింది.
709 కోట్ల వ్యూస్ వచ్చాయి. ఇప్పటివరకు ప్రపంచం మొత్తంలో 709 కోట్ల వ్యూస్ తెచ్చుకున్న మొదటి సినిమాగా రికార్డు క్రియేట్ చేసింది జయజానకి నాయక. మన దగ్గర ఆశించిన స్థాయిలో ఆకట్టుకోలేక పోయినప్పటికీ హిందీ ఆడియన్స్ కు మాత్రం అమితంగా ఆకట్టుకుంది.
ఇక ఈ సినిమా తర్వాత కేజీఎఫ్ 702 కోట్ల వ్యూస్ తో సెకండ్ ప్లేస్ లో ఉంది. ఇక ప్రస్తుతం బెల్లంకొండ శ్రీనివాస్ ఛత్రపతి సినిమాను హిందీలో రీమేక్ చేస్తున్నారు. త్వరలోనే ఈ సినిమా బాలీవుడ్ లో రిలీజ్ కానుంది.