సినీ నిర్మాత బెల్లంకొండ సురేష్, ఆయన కుమారుడు హీరో బెల్లకొండ శ్రీనివాస్‌పై నాంపల్లి కోర్టు ఆదేశాల మేరకు హైదరాబాద్ సీసీఎస్ పోలీసులు కేసు నమోదు చేశారు. మలినేని గోపిచంద్ దర్శకత్వంలో తన కుమారుడితో తీయబోయే చిత్రానికి సహ నిర్మాతగా అవకాశం కల్పిస్తానని చెప్పి.. 2018లో తన వద్ద సురేష్ విడతల వారీగా రూ.85 లక్షల తీసుకున్నాడని ఆరోపిస్తూ.. ప్రకాశం జిల్లాకు చెందిన వీఎల్ శరణ్ కుమార్ నాంపల్లి కోర్టులో ఫిర్యాదు చేశాడు. అతన వాదనలు విన్న న్యాయస్థానం.. బెల్లంకొండ సురేష్ తో పాటు.. ఆయన కుమారుడు బెల్లంకొండ సాయిశ్రీనివాస్‌పై కేసు నమోదు చేయాలని సీసీఎస్ పోలీసులను ఆదేశించింది.దీంతో కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు పోలీసులు. ఈ నేపథ్యంలో బెల్లంకొండ సురేష్ మీడియాతో మాట్లాడారు.
తనను, తన కుటుంబాన్ని ఇబ్బంది పెట్టేందుకు కొంతమంది పన్నిన కుట్రలో భాగమే మాపై నమోదు చేయడానికి కారణం అని అన్నారు. తనకు శరణ్ ఎలాంటి డబ్బు ఇవ్వలేదని పేర్కొన్నారు. తనపై, తన కొడుకుపై కావాలనే కుట్ర చేసి ఇబ్బందులకు గురి చేస్తున్నారని మండిపట్టారు. డబ్బులు ఇచ్చినట్టు సాక్ష్యాలు ఉంటే పోలీసులకు ఇవ్వాలి. కానీ ప్రైవేట్ కంప్లైంట్ తో కోర్టుకు వెళ్లాల్సిన అవసరం ఏం వచ్చిందని ప్రశ్నించారు.
తనను, తన కొడుకు ఇమేజ్ ను డామేజ్ చేయడానికి కావాలనే తమకు రూ. 85 లక్షల ఇచ్చాను అంటూ ఆరోపణలు తీసుకొచ్చారని పేర్కొన్నారు. నా పిల్లల జోలికి వచ్చాడు.. నా పిల్లలే నాకు పంచ ప్రాణాలు. శరణ్ ను వదిలిపెట్టను.. లీగల్ గా ఎదుర్కొంటానని ఆవేశపూరితంగా మాట్లాడారు సురేష్. అతనిపై పరువు నష్టం దావా వేసి తన అసలు బండారాన్ని బయటపెడాతానని విరుచుకుపడ్డారు.
తమకు కోర్టు నుంచి కానీ.. సీసీఎస్ నుంచి ఎలాంటి నోటీసులు రాలేదని పేర్కొన్నారు సురేష్. శరణ్ ది తమ ఊరేనని.. పదేళ్ళ క్రితం తమకు పరిచయం అయ్యాడని.. టికెట్ల కోసం ఫోన్ చేస్తూ ఉండేవాడని చెప్పారు సురేష్. శరణ్ అనవసరంగా తన కొడుకు పేరును బ్లేమ్ చేస్తున్నాడని ఆవేదన వ్యక్తం చేశారు. అతనే వచ్చి క్షమించమని వేడుకున్నా నేను ఊరుకోను అని.. అతని వెనకాల ఓ రాజకీయ నాయకుడు ఉన్నాడని అన్నారు. అతనెవరో బయట పెడతా..’ అంటూ తేల్చి చెప్పాడు బెల్లంకొండ సురేష్.