మంచిర్యాల జిల్లాలో కరోనా వైరస్ కేసులు భారీగా నమోదవుతున్నాయి. ముఖ్యంగా విద్యా సంస్థల్లో ఈ కేసులు బయటపడటం అందర్నీ కలవరపెడుతుంది.
తాజాగా మంచిర్యాల జిల్లాలోని బెల్లంపల్లి ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలలో ఒక్కరోజే 21 కేసులు వచ్చాయి. సోమవారం కొందరిలో కరోనా లక్షణాలు కనిపించాయి. అప్రమత్తమైన కళాశాల అధికారులు మంగళవారం కొవిడ్ పరీక్షలు చేయించారు. 146 మందిని పరీక్షించగా.. 13 మంది సిబ్బంది, 8మంది విద్యార్థులకు పాజిటివ్ వచ్చింది. ఒక్కరోజే పెద్ద సంఖ్యలో కేసులు నమోదు కావడంపై అధ్యాపకులు, విద్యార్థుల్లో ఆందోళన నెలకొంది.
కరోనా వైరస్ నేపథ్యంలో సెమిస్టర్ పరీక్షలు రద్దు చేయాలని విద్యార్థులు డిమాండ్ చేశారు. లేదంటే కనీసం వాయిదా అయినా వేయాలన్నారు.