అల్లుడు శీను సినిమాతో టాలీవుడ్ లో హీరోగా పరిచయమయ్యాడు బెల్లంకొండ శ్రీనివాస్. మొదటి సినిమా విజయం సాధించినప్పటికీ కలెక్షన్ ల పరంగా మాత్రం కాస్త నిరాశపడ్డాడు. జయజానకీనాయక మినహా ఆ తరువాత వచ్చిన సినిమాలు కూడా అంతగా ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయాయి.
కానీ రాక్షసుడు సినిమాతో మంచి సక్సెస్ అందుకున్న బెల్లంకొండ ఆ సినిమాకు సీక్వెల్ గా మరో సినిమాను చేసే ఆలోచనలో ఉన్నాడట. తొలి భాగాన్ని రూపొందించిన దర్శకుడు రమేష్ వర్మ ఈ సినిమా సీక్వెల్ సబ్జెక్ట్‌ను సిద్ధం చేస్తున్నారట. రాక్షసుడు ను నిర్మించిన కోనేరు సత్యనారాయణ నిర్మాణంలోనే ఈ సీక్వెల్ కూడా తెరకెక్కబోతోందట. అన్నీ అనుకున్నట్టు జరిగితే వచ్చే ఏడాది ఆరంభంలో ఈ సినిమా పట్టాలెక్కే ఛాన్సుందని సమాచారం.