గత కొద్ది రోజులుగా నాయకులు, అధికారులు చేసిన కృషి ఫలించింది. ఆసియా ఖండంలో ప్రసిద్ధి గాంచిన బెలూం గుహ ల ఉత్సావాలు ప్రారంభమయ్యాయి. కర్నూలు జిల్లా కొలిమిగుండ్ల మండలంలో బెలూం గుహల ఉత్సవాలను కలెక్టర్ వీరపాండ్యాన్ జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. ఈ ఉత్సవాల్లో పాణ్యం ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్ రెడ్డి.ఎమ్మెల్సీ చల్లా రామ కృష్ణారెడ్డి.తదితర ఉన్నతాధికారులు పాల్టొని ప్రసంగించారు.
ఎంతో ప్రశాంతంగా, ఆహ్లాదాన్ని కలిగించే వాతావరణం లో బెలూం గుహలు ఉండటం ఈ ప్రాంత ప్రజలకు వరం లాంటి దని కలెక్టర్ అన్నారు. భూగర్భం లో ఏర్పడిన గుహలు ఎంతో అద్భుతం గా ఉన్నాయని కలెక్టర్ ప్రశంశించారు. ఇలాంటి వాటిని మరింత అభివృద్ధి పరిచినట్లయితే పర్యాటక రంగం అభివృద్ధి చెందడంతో పాటు ఆర్ధిక లాభం కూడా చేకూరుతుందని…ప్రజలకు మరిపోలేని అనుభూతి కలిగిస్తుందన్నారు. తాను వ్యక్తిగతంగా కూడా గతం లో కుటుంబ సభ్యుల తో కలిసి గుహల ను వీక్షించినట్లు ఈ సందర్భం గా ఆయన గుర్తు చేసుకున్నారు. బెలూమ్ గుహ లను మరింత అభివృద్ధి పర్యాటక ప్రదేశంగా అభివృద్ధి పర్చేందుకు తనవంతు కృషి తప్పకుండా చేస్తానని కలెక్టర్ హామీ ఇచ్చారు.
ఉత్సావాల సందర్భంగా సుమారు 18 శాఖలకు చెందిన స్టాళ్లను ఏర్పాటు చేసి పర్యాటకులకు అవగాహన కల్పించారు. మహిళలకు ముగ్గుల పోటీలు ,విద్యార్థులకు పలు క్రీడలను నిర్వహించారు.బుల్లి తెర నటుల తో ప్రదర్శించిన సన్నివేశాలు. సాంసృతిక కళాకారులు ప్రదర్శించిన నృత్యం ప్రేక్షకులను ఆకట్టుకుంది. స్టాళ్ల లో ప్రదర్శించిన ఒంగోలు జాతి ఒంగోలు జాతి ఎద్దులు రైతులను ఎంతగానో అక్షర్శించాయి.
Advertisements
ఉత్సావాల సందర్భంగా ఎమ్మెల్యే కాటసాని రామిరెడ్డి మాట్లాడుతూ…గతం లో బెలూమ్ గుహల ను ప్రజలకు అందుబాటు లోనికి తీసుకొని వచ్చేందుకు చలపతి రెడ్డి అనే బెలూమ్ వాసి చేసిన కృషిని ఈ ప్రాంత ప్రజలు ఎన్నటికీ మర్చి పోరని అన్నారు. బెలూమ్ గుహల ప్రాముఖ్యతను పూర్వ చరిత్రను సభలో ప్రజలకు వివరించారు. జిల్లా కలెక్టర్ గుహ లపై మరింత శ్రద్ద వహించి సిమ్మింగ్ ఫూల్ ,విశ్రాంతి భవనాలు, అత్యాధునిక వసతులతో క్యాంటీనువంటివి నిర్మించేందుకు చర్యలు చేపట్టాలని కోరారు. ఉత్సవాల ప్రారంభం కోసం గత కొన్ని రోజులుగా శ్రమించిన అన్ని శాఖల అధికారులకు ఎమ్మెల్యే కాటసాని రామి రెడ్డి కృతజ్ఞతలు తెలియ జేశారు. బెలూమ్ ఉత్సవాలకు రాష్ట్ర మంత్రులు వస్తారని ఎంతో ఆసక్తిగా ఎదురు చూసిన ప్రజలకు వారు రాకపోవడంతో నిరాశే మిగిలింది.