చాలా మంది ఈ రోజుల్లో వినూత్నంగా సొంత కాళ్ళ మీద నిలబడటమే కాకుండా తమ కంటూ ఒక ప్రత్యేక గుర్తింపు చాలా కష్టపడుతున్నారు. ఇందుకోసం అవసరం అయితే ఉద్యోగాలను కూడా వదిలేయడానికి ఏ మాత్రం వెనకడుగు వేయడం లేదు. చైనాకు చెందిన ఒక వ్యక్తి తాను అనుకున్నది చేయడానికి తన జాబ్ వదిలేసి లక్షలు లక్షలు సంపాదిస్తున్నాడు. ఇన్వెస్ట్‌మెంట్ బ్యాంకింగ్ అనలిస్ట్‌గా పనిచేసిన బెన్ చోన్, 2018లో ఒక టాప్ కంపెనీ నుంచి బయటకు వచ్చి సొంత యుట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసాడు.
తన కాళ్ళ మీద తాను నిలబడాలని భావించిన అతగాడు ఏ మాత్రం వెనక్కు తగ్గకుండా… ఈ రోజు లక్షలు డ్రా చేస్తున్నాడు. బెన్ Rareliquid పేరుతో యూట్యూబ్ ఛానెల్‌ని ఓపెన్ చేసి… తనకు బాగా తెలిసిన ఫైనాన్స్ ప్రపంచంపై దృష్టి పెట్టాలని నిర్ణయించుకున్నాడు. ఫైనాన్స్, టెక్ మరియు క్రిప్టోకరెన్సీలలో ఎవరు అయినా సరే తమ కెరీర్‌ను ఎలా అభివృద్ధి చేసుకోవాలనే దాని గురించి ఎప్పటికప్పుడు వీడియో లు చేసాడు. ఇప్పుడు, బెన్ చోన్ ఛానల్ కు 71000 మంద సబ్ స్క్రైబర్స్ ఉన్నారు.
అతని గత నెల ఆదాయం చూస్తే… మైండ్ పోవడం ఖాయం. సుమారుగా రూ. 17 లక్షల వరకు సంపాదించాడు. ఇక అతని ఛానల్ కు బ్రాండ్ స్పాన్సర్‌షిప్‌లు, ప్రకటనలు, రెజ్యూమ్ సలహాలు మరియు కోర్సు ఆఫర్‌లు గట్టిగా వస్తున్నాయి. స్టాక్‌లలో పెట్టుబడి పెట్టడం తనకు ఎప్పుడూ ఇష్టమని, తన ఛానెల్ ద్వారా తోటి పెట్టుబడిదారులకు సలహాలు ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నా అని చెప్పాడు.