ఇప్పుడు అంటే వంట చేసుకోవడానికి స్టీల్ ఇత్తడి పాత్రలు ఉన్నాయి.. నీరు త్రాగడానికి బిందెలు, ప్లాస్టిక్ డబ్బాలు అందుబాటులోకి వచ్చాయి. కానీ ఒకప్పుడు అయితే మట్టి పాత్రలలోనే ఆహారాన్ని వండుకునేవారు. కుండలలో నీటిని తాగే వారు. అయితే మట్టి కుండలో వంట చేసుకోవడం వల్ల అలాగే మట్టి కుండలో నీటిని తాగడం వల్ల ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయని ఆయుర్వేద నిపుణులు చెబుతున్నారు.
మట్టి కుండలోని నీరు తాగడం వల్ల శరీరంలో ఉండే ఎసిడిటీ సమస్య పూర్తిగా తగ్గిపోతుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. కుండలో నీటితో శరీరం డీహైడ్రేట్ అవ్వకుండా జాగ్రత్త పడవచ్చు అని చెబుతున్నారు. ప్రస్తుతం ఎక్కడ చూసినా ప్యూరిఫైడ్ మిషన్ లు కనిపిస్తున్నాయి. అయితే మట్టి కుండలో నీరు ఎంతో ప్యూరిఫై అవుతాయని అంటున్నారు.
మట్టి కుండలో నీటిని తాగడం వల్ల మెటబాలిజం రేటు కూడా మెరుగుపడుతుందని చెబుతున్నారు. ఏవైనా చర్మ సమస్యలు ఉన్నా లేదంటే చర్మం ఆరోగ్యంగా ఉండాలంటే మట్టి కుండలో నీటి తో స్నానం చేయాలని చెబుతున్నారు. మట్టి కుండలోని నీటిని తాగడం వల్ల జీవక్రియలు మెరుగుపడతాయని చెప్తున్నారు. అంతేకాకుండా శరీరంలో వేడి సమస్యతో బాధపడే వారు ఈ నీటిని తాగటం వల్ల చలవ చేస్తుందని చెబుతున్నారు.