ఒకప్పుడు అంటే హాస్టల్స్‌లో ఉండి చదువుకునేందుకు విద్యార్థులు భయపడేవారు. కానీ ఇప్పుడా భయం లేదు. కారణం.. ఇంటి కన్నా హాస్టల్స్ లోనే మరింత సౌకర్యవంతంగా ఉండవచ్చని చాలా మంది ఫీలవుతుంటారు. అందుకు అనేక కారణాలు ఉంటాయి. అయితే హాస్టల్స్ లో ఉంటే మాత్రం విద్యార్థులకు అనేక లాభాలు కలుగుతాయి. అవేమిటో ఒక లుక్కేద్దామా..!
1. హాస్టల్‌లో ఒకరు మ్యాగీ నూడుల్స్ తెస్తే ఒకరు హీటర్ తెస్తారు. ఇంకొకరు హాట్ వాటర్ తెస్తారు. ఇలా అన్నింటినీ షేర్ చేసుకుంటారు.
2. అందరూ ఒకే లాంటి ఫుడ్ తింటే ఓకే. కానీ ఒక్కరు మాత్రమే వెరైటీ ఫుడ్ తింటే.. అందరికీ షేర్ చేయాల్సి ఉంటుంది.
3. వారంలో ఒకటి లేదా రెండు సార్లు మాత్రమే గదులను శుభ్రం చేస్తారు. దాని గురించి అనవసరంగా అంతగా పట్టించుకోవాల్సిన పనిలేదు.
4. వ్యక్తిగతంగా వాడే సబ్బులు, సాక్సులు వంటివి తప్ప రూమ్‌లో ఉండే అందరి వస్తువులను అందరూ ఉపయోగించుకుంటారు.
5. రూమ్‌లో ఒక వ్యక్తి నిద్ర పోతుంటే మిగిలిన అందరూ ఎంతో బాధ్యతగా సహకరిస్తారు. అది నిద్రపోయే వారికి మిగిలిన వారు చేసే ఫేవర్ అని చెప్పవచ్చు.
6. అలారం పెట్టుకుంటే నిద్ర లేస్తారో, లేదో తెలియదు కానీ రూమ్ మేట్‌ను నమ్ముకుంటే కచ్చితంగా నిద్ర లేపుతారు.
7. ఒక వ్యక్తి చదువుల్లో బాగా రాణిస్తుంటే ఎగ్జామ్ ముందు ఆ వ్యక్తి మిగిలిన రూమ్ మేట్లకు టీచర్ అవుతాడు.
8. క్లాసులకు బంక్ కొట్టాలన్నా, లవ్ ఇష్యూలు వచ్చినా, పేరెంట్స్‌కు సర్ది చెప్పాలన్నా.. రూమ్ మేట్స్ ఉంటే కలిగే లాభాలే వేరు. అన్నీ వారే చూసుకుంటారు.
9. ఎవరైనా అనారోగ్యానికి గురైతే తోటి రూమ్ మేట్స్ అన్నీ చూసుకుంటారు. ట్యాబ్లెట్లు, ఫుడ్, ఇతర అవసరమైన వస్తువులను తెచ్చి పెడతారు. ఇంకా అవసరం అయితే తలకు మసాజ్ కూడా చేస్తారు.
10. ఇంకొకరి దుస్తులను పొరపాటుగా తమవి అనుకుని ఉతికితే ఆ సహాయం పొందివారు ఎంతో సంతోషంగా ఫీలవుతారు.
11. రూమ్ రేట్ రెండు, మూడు రోజులకు ఒకసారి స్నానం చేస్తూ శరీరం దుర్వాసన వస్తున్నా తోటి రూమ్ మేట్స్ అందుకు సహకరిస్తారు.
12. రూమ్‌కు ఒకటే తాళం చెవి ఉంటే దాన్ని సహజంగానే రూమ్ బయట చెప్పుల స్టాండ్‌లో షూలలో లేదా పవర్ సప్లై బోర్డు మీదో పెడతారు. ఇది రివాజు.
13. ఒక రూమ్ మేట్ ఏదైనా ఒక మ్యూజిక్‌కు డర్టీ డ్యాన్స్ చేస్తే ఇతర రూమ్ మేట్స్ ఆ వీడియోను సీక్రెట్ గా తీసి అనంతరం దాన్ని ఆ రూమ్ మేట్‌కు చూపిస్తే అప్పుడు వచ్చే మజాయే వేరు. పార్టీ అయినా, ఇతర వేడుక అయినా రూమ్ మేట్స్‌తో సెలబ్రేట్ చేసుకుంటే కలిగే ఆనందమే వేరు.
హాస్టల్ లైఫ్ అనేది నిజంగా జాయ్‌ఫుల్ లైఫే. కానీ కేవలం కొందరు మాత్రమే దాన్ని పూర్తిగా ఎంజాయ్ చేయగలుగుతారు. కొందరు మిస్ అవుతారు..!