మన కిందటి తరాలు ఆహారం విషయంలో ఏ విధమైన భయాలు లేకుండా తిని ఆరోగ్యంగా జీవితాన్ని గడిపేశారు. అయితే ఇప్పటి తరాలు మాత్రం అవసరమైన ఆహారం వదిలేసి అనవసర ఆహారం మీద దృష్టి పెట్టిన పరిస్థితి ఉంది. పళ్ళు, ఫలాలు, సద్ది అన్నం ఇలా వాళ్లకు ఏది అందుబాటులో ఉంటే అది తిని ఆరోగ్యంగా ఉన్నారు. ఇక జామ కాయల విషయంలో ఈ తరానికి పెద్దగా ప్రయోజనాలు తెలియవు అనే చెప్పాలి.
Also Read:కాళీమాత పూజ ఎలా చేయాలో బీజేపీ చెప్పాల్సిన పనిలేదు!
దీన్ని పెద్దలు ప్రకృతి ప్రసాదం అనే చెప్తారు. దక్షిణ అమెరికా లో గుర్తించిన జామను పోర్చుగీస్ వారు మన దేశానికి తీసుకొచ్చారు. ప్రాంత , దేశాల వారీగా రూపం లో తేడా ఉండవచ్చు గాని జామ కాయ మాత్రం ఆరోగ్యానికి చాలా మంచిది. మన శరీరానికి అవసరమైన సి విటమిన్ ఫుల్ గా దొరుకుతుంది. ఆరెంజ్ ఫ్రూట్ కంటే కూడా జామ కాయలోనే ఎక్కువగా దొరుకుతుంది.
షుగర్ ఉన్న వాళ్ళు జామ కాయ తినకూడదు అనే భయం ఉంది. కాని జామ కాయతో షుగర్ అందుబాటులో ఉంటుంది. జామ కాయ అనేక రకాలుగా మనకు రక్షణ కల్పిస్తుంది. చర్మ రక్షణ , జీర్ణ సంబంధిత సమస్యలతో పాటుగా కంటి చూపు మెరుగు పరుచుకోవడానికి ఉపయోగపడుతుంది. అలాగే గర్భిణి స్త్రీలకు కూడా ఇది ఉపయోగకరంగా ఉంటుంది. 2 జామపండ్లు తిన్న తర్వాత మన షుగర్ లెవెల్ మహా అంటే ఒక 50 పెరుగుతుంది. తినక ముందు 70 ఉంటే తిన్న తర్వాత 120 ఉంటుంది. అది మనకు ఆరోగ్యకరమే.
Also Read:టీఆర్ఎస్ సర్వే.. అవాక్కయ్యే నిజాలు