వేసవి కాలం వచ్చిందంటే చాలు ఎక్కువగా మనం మామిడి కాయ తినడానికి ఇష్టపడుతూ ఉంటాం. వేసవిలో ప్రతీ ఇంట్లో కూడా మామిడి కాయ దర్శనం ఇస్తుంది. ఆసియా ఖండంలో ఎక్కువగా మామిడి పంట ఉంటుంది అనేది తెలిసిందే. ఇక మామిడి కాయతో మంచి ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. రొమ్ము, పెద్దపేగు క్యాన్సర్ కణాల పెరుగుదలను అరికడుతుంది మామిడి పండు.
Also Read:రే చీకటి వచ్చినప్పుడు ఏం జరుగుతుంది…? రాకుండా ఉండాలంటే ఏం చెయ్యాలి…?
మామిడి పండ్ల నుంచి తీసిన పాలీఫెనోల్‌లో క్యాన్సర్ కణాల పెరుగుదలను అరికట్టే గుణం ఉందని గుర్తించారు. ఐదు రకాల మామిడి పండ్ల నుంచి తీసిన పాలీఫెనోల్‌ను.. రొమ్ము, పెద్దపేగు, ఊపిరితిత్తులు, ప్రోస్టేట్, రక్త క్యాన్సర్ల బాధితులకు ఇచ్చి పరీక్షలు చేసి… క్యాన్సర్ కణాల వృద్ధిని అడ్డుకోవటమే కాదు, ఇది రెండు క్యాన్సర్ కణాలను చనిపోయే స్థితికీ తీసుకొచ్చింది అని గుర్తించారు.
ఇక అసలు విషయానికి వస్తే… చాలా మంది భోజనం చేస్తున్నప్పుడూ పూర్తయిన తర్వాత మామిడి పండ్లు తినడానికి బాగా ఇష్టపడతారు. ముఖ్యంగా పెరుగు అన్నం తో కలిపి మామిడి పండ్లను తినడం చాలామందికి బాగా ఇష్టం అనే సంగతి తెలిసిందే. అయితే ఇలా ఆహారంతోపాటు మామిడి పండ్లను తీసుకుంటే క్యాలరీలు ఎక్కువగా శరీరంలోకి వెళ్తాయి. ఆ తర్వాత మీరు మీరు బరువు పెరిగే అవకాశం ఉంటుంది. భోజనం పూర్తయిన తర్వాత ఒక గంట తర్వాత మామిడి పండ్లు తినడం ఉత్తమం.
Also Read:మనిషి జీవితంలో భాగంగా మారిన టెక్నాలజీ..!