బెంగాల్ సీఎం మమతా బెనర్జీ ఎస్. ఎస్.కె.ఎం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. తన ఎడమ కాలు మడిమ విరిగిందని, చాతిలో నొప్పితో పాటు కుడి భుజానికి కూడా గాయం అయ్యిందని ఆసుపత్రి వర్గాలు ప్రకటించాయి. సీఎంను 48గంటల పాటు డాక్టర్ల పర్యవేక్షణలో ఉంచామని… తను జ్వరంతో కూడా బాధపడుతున్నారని తెలిపాయి.
ఇంతకు మమతా బెనర్జీకి ఏం జరిగింది…?
సీఎం మమతా బెనర్జీ భారీ ర్యాలీతో కలిసి నందీగ్రామ్ లో నామినేషన్ వేశారు. అనంతరం సాయంత్రం ఎన్నికల ప్రచారంలో పాల్గొంటున్న సమయంలో తనపై నలుగురైదుగురు గుర్తు తెలియని వ్యక్తులు దాడి చేశారని, కావాలనే తనను కింద పడేశారని సీఎం మమతా ఆరోపించారు. తను గుడి పక్క నుండి ర్యాలీ వెళ్తున్న సందర్భంలో… దేవుడికి నమస్కరిస్తుండగా ఈ దాడి జరిగిందని, ఆ సమయంలో తన ర్యాలీకి పోలీసులే లేరని… ఎస్పీ కూడా అక్కడ లేరని… ఇందులో ఎదో కుట్ర కోణం దాగి ఉందని ఆమె ఆరోపించారు.
బెంగాల్ పై దాడి చేసి… బీజేపీ అధికారాన్ని కైవసం చేసుకునేందుకు ఇలాంటి దాడులకు వెనుకాడటం లేదని టీఎంసీ ఆరోపించింది.
.@BJP4Bengal Brace yourselves to see the power of people of BENGAL on Sunday, May 2nd.
Get READY!!! pic.twitter.com/dg6bw1TxiU
— Abhishek Banerjee (@abhishekaitc) March 10, 2021