బెంగాల్ మంత్రి, టీఎంసీ నేత పార్థ ఛటర్జీ కేసులో సంచలన విషయాలు బయటకి వస్తున్నాయి. ఆదాయానికి మించి ఆయన ఆస్తులు కూడ బెట్టిన తీరును ఈడీ బయటకు తీస్తూ వస్తోంది.
తాజాగా ఈడీ దర్యాప్తులో మరో సంచలన విషయం వెల్లడైంది. తన పెంపుడు కుక్కల కోసమే ఆయన ఓ లగ్జరీ ప్లాట్ ను కొన్నట్టు ఈడీ విచారణలో తెలిసింది.
ఆయనకు డైమండ్ సిటీలో అత్యంత ఖరీదైన మూడు ప్లాట్లు ఉన్నట్టు ఈడీ అధికారులు గుర్తించారు. బెంగాల్‌లో ఉపాధ్యాయ నియామక ప్రక్రియకు సంబంధించి కేసులో పార్థ చటర్జీని ఈడీ అధికారులు అదుపులోకి తీసుకున్నారు.
మరోవైపు మంత్రి సన్నిహితురాలు అర్పిత ఇంట్లోనూ ఈడీ సోదాలు నిర్వహించింది. ఆ సమయంలో అర్పిత ఇంట్లో భారీగా డబ్బులు కట్టలను అధికారులు గుర్తించారు. దీంతో ఆమెను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
మరోవైపు ఓ ప్లాట్ ను అర్పితకు గిఫ్ట్ ఇచ్చినట్టు వెల్లడైంది. శాంతినికేతన్, బోల్సూర్ లలో పార్థ చటర్జీకి అర్పిత ముఖరజీలకు ఉమ్మడిగా ఓ ప్లాట్ ఉందని, అదికాక చటర్జీ మూడు ప్లాట్లు ఉన్నాయని గుర్తించింది.