అభిమానానికి ప్రాంతంతో పనిలేదు. సినిమాలు, క్రీడలు, రాజకీయాలకు సంబంధించిన అభిమానులు ఖండాలు దాటే ఉంటారు.అభిమానంతో ఆశ్చర్య పరచిన ఎన్నో సందర్భాలు, ఉదంతాలు ఉన్నాయి. తమిళ నటుడు అజిత్ కు ఫ్యాన్ ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు తనదైన హీరోయిక్ మేనరిజంతో ఎంతోమంది ప్రేక్షకుల హృదయాల్లో స్థిరపడిపోయాడు. తమిళ్ తో పాటుగా తెలుగు, కన్నడ, మళయాళీ భాషల్లో కూడా అజిత్ కు హార్డ్ కోర్ ఫ్యాన్స్ ఉన్నారు.
అజిత్ హీరోగా హెచ్ వినోద్ దర్శకత్వంలో తెరకెక్కిన లేటెస్ట్ మూవీ తునివు చిత్రం ఇవ్వాళ భారీ అంచనాల నడుమ ప్రేక్షకుల ముందుకు వచ్చింది. తమ అభిమాన నటుడి చిత్రం రిలీజ్ కావడంతో థియేటర్ల ముందు ఫ్యాన్స్ సందడి చేశారు.
కర్ణాటకకు చెందిన అజిత్ అభిమాని ఒకరు భారీ ఎత్తున కటౌట్‌ను ఏర్పాటు చేశాడు. ఈ కటౌట్ కోసం అతను అక్షరాల రూ.7 లక్షలు వెచ్చించాడు. దీనికి సంబంధించిన ఫోటో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
అటు కేరళలోని ప్రియదర్శని థియేటర్‌లో 120 అడుగుల అజిత్ ఫ్లెక్స్ ను అభిమానులు ఏర్పాటు చేశారు. రాష్ట్రంలో ఒక నటుడి కోసం ఇంత ఎత్తైన ఫ్లెక్స్ ఏర్పాటు చేయడం ఇదే తొలిసారి కావడం విశేషం.
అజిత్, హెచ్.వినోద్ కాంబినేషన్‌లో తెరకెక్కిన తునివు చిత్రాన్ని బోనీకపూర్ భారీ బడ్జెట్ తో నిర్మించారు. మంజు వారియర్, జాన్ కొక్కెన్, సముద్రఖని, GM సుందర్ లు కీలకపాత్రులు పోషించారు. జిబ్రాన్ సంగీతం అందించారు.
Gigantic Cutout with Garland for Mankatha movie in Karnataka 😎
Thala Ajiths mass 🔥 #28YrsOfSELFMADETHALAAjith#Valimai pic.twitter.com/qlL3GhkpwT
— TRENDS AJITH (@TrendsAjith) August 3, 2020