ఫుల్లుగా తాగిన బెంజ్ కారు డ్రైవర్ గురువారం అర్థరాత్రి కూకట్ పల్లిలో బీభత్సం సృష్టించాడు. అతివేగంగా వచ్చి ఆగి ఉన్న మూడు కార్లను ఢీకొట్టాడు. దీంతో మూడు కార్లు ధ్వంసమయ్యాయి.
అక్కడే ఉన్న కొందరు కారు ను అడ్డుకొని డ్రైవర్ ను ప్రశ్నించగా బెదిరింపులకు దిగాడు. ఈ విషయం గురించి పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు కార్ల యజమానులు తెలిపారు.
అయినప్పటికీ వారు కూడా నిర్లక్ష్యంగా వ్యవహరించారని పేర్కొన్నారు. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.