ఫ్యామిలీ మెన్ 2 వెబ్ సీరిస్‌తో బాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చిన బ్యూటీ సమంతకు.. మొత్తానికి గ్రాండ్ వెల్‌కమ్ దక్కింది. తొలి సీరిస్‌తోనే అమ్మడి పేరు బీటౌన్‌లో మారిమోగిపోతోంది. అందుకు కారణం లేకపోలేదు. అలా అడుగుపెట్టగానే.. ఇలా సమంతకు ఉత్తమ నటి అవార్డు దక్కడం ఇంట్రెస్టింగ్‌గా మారింది.
ఇండియన్ ఫిల్మ్ ఫెస్టివల్ ఆఫ్ మెల్‌బోర్న్ – 2021 ఏడాదికి సంబంధించిన అవార్డులను తాజాగా ప్రకటించింది. ఇంతులో ఫ్యామిలీ మ్యాన్-2కు అవార్డుల పంట దక్కింది. ఏకంగా ఈ సీరిస్‌కు రెండు అవార్డులు వచ్చాయి. మనోజ్ బాజ్‌పేయి ఉత్తమ నటుడు అవార్డు అందుకోగా.. ఇదే సీరిస్‌లో నటించిన సమంత ఉత్తమ నటి అవార్డు దక్కింది. శ్రీలంకన్ తమిళ యువతిగా.. డీగ్లామర్ పాత్రలో నటించి సమంత మంచి మార్కులు కొట్టేసింది.