బ్రిటన్ లో అరుదైన ఘటన చోటు చేసుకుంది. నాటింగమ్ షైర్ కు చెందిన జహరా అమిరా బాదీ(28) ఒకే కాన్పులో ముగ్గురికి జన్మనిచ్చింది. ఆ ముగ్గురూ ఒకే పోలికలో ఉండటం గమనార్హం.
200 మిలియన్ల మందిలో ఒక్కరికి ఇలాంటి కవలలు పుడతారని వైద్యులు చెబుతున్నారు. రుయా, అదినా, సెల్పియా అనే ముగ్గురు కుమార్తెలను అమిరా గతేడాది డిసెంబర్ లో జన్మనిచ్చారు.
అమిరా గర్భవతిగా ఉన్నప్పుడు 12 వ వారం తీసిన స్కానింగ్ లో ఆమె గర్భంలో ముగ్గురు పిల్లలు ఉన్నట్టు వైద్యులు మొదట గుర్తించారు. ఇదే విషయాన్ని ఆ దంపతులకు తెలియజేయడంతో వారు ఆశ్చర్యానికి గురయ్యారు.
తమ వంశంలొ ఇద్దరు కవలలు పుట్టిన ఘటనలు చాలానే ఉన్నాయని అమిరా భర్త అశ్రఫ్ తెలిపాడు. కానీ తొలిసారిగా తమకు ముగ్గురు పిల్లలు పుట్టడం సంతోషంగా ఉందని చెప్పారు.