దగ్గుబాటి ఫ్యామిలీలో వెంకటేష్ తరువాత టాలీవుడ్ కి హీరోగా ఎంట్రీ ఇచ్చాడు రానా. రానా త్వరలో ఓ ఇంటివాడు కాబోతున్నాడు. మిహిక బజాజ్ తో ప్రేమలో పడ్డ రానా పెళ్ళికి సిద్ధం అయ్యాడు. అయితే ఇటీవల జరిగిన రోకా ఫంక్షన్ కు సంబంధించిన ఫోటోలు నెట్టింట్లో వైరల్ గా మారాయి. ఆ ఫోటోలలో దగ్గుబాటి ఫ్యామిలీతో పాటు నాగ చైతన్య, సమంతా కూడా ఉన్నారు. తాజాగా సమంత తన సోషల్ మీడియా అకౌంట్ లో రానాకు విషెస్ చెపుతూ పోస్ట్ పెట్టారు. “2020 లో బెస్ట్ న్యూస్ మాకు తీసుకొచ్చినందుకు థ్యాంక్ యూ. రానా దగ్గుబాటి.. మిహికా బజాజ్ మీరు హ్యాపీగా ఉండాలి” అంటూ క్యాప్షన్ ఇచ్చింది.