ఇండియా- ఆస్ట్రేలియాల మధ్య ఆర్థిక సహకారం, వాణిజ్య ఒప్పందాల ప్రాధాన్యత గురించి కేంద్ర మంత్రి పీయూష్ గోయెల్ బుధవారం వివరించారు. ఇరు దేశాల మధ్య ఒప్పందాలు ఆలస్యమయ్యాయని కానీ అసలు లేనిదాని కన్నా ఆలస్యం మేలు కదా అని అన్నారు.
ఇరు దేశాల మద్య ఆర్థిక సహకారం, వాణిజ్య ఒప్పందాల(ఈసీటీఏ) ఏప్రిల్ 2 న జరిగాయి. ఈ నేపథ్యంలో ఆయన మూడు రోజుల పర్యటన నిమిత్తం ఆస్ట్రేలియాకు మంగళవారం వెళ్లారు.
ఈ ఒప్పందాల వల్ల ఇరు దేశాల మధ్య సోదరభావం, సౌభ్రాతృత్వం, ఐక్యతను తిరిగి పొందడానికి మనకు అవకాశం లభిస్తుందన్నారు. రెండు దేశాల మధ్య సంబంధాలను పెంపొందించడంలో భారత్- ఆస్ట్రేలియాలు 50 ఏండ్లు ఆలస్యం చేశాయన్నారు.
ఈ సంబంధం రెండు దేశాలు పరస్పరం అభివృద్ది చెందడానికి, ఇరు దేశాల ప్రజలకు మంచి భవిష్యత్తును అందించడానికి ఉపయోగపడుతుందని పేర్కొన్నారు.