చాలా మంది క్రెడిట్ కార్డు విషయంలో వద్దంటే వద్దని సలహాలు ఇస్తూ ఉంటారు. క్రెడిట్ కార్డుకి అలవాటు పడితే ఆస్తులు అమ్ముకోవాలనే విషయం ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇక క్రెడిట్ కార్డు విషయంలో జనాలు ఎందుకు భయపడతారో ఒక్కసారి చూద్దాం.
క్రెడిట్ కార్డులో మనం వాడిన సొమ్ము వాయిదా వేసే అవకాశం ఉంది కాబట్టి అది దీర్ఘకాలిక ఋణంగా మారే అవకాశం ఉంది. డబ్బు లేదా డెబిట్ కార్డులో మన చేతిలో ఉంటే ఖర్చు చేస్తాం. కాని క్రెడిట్ కార్డు విషయంలో సినిమా అలా ఉండదు. ఏదైనా ఖరీదైన వస్తువుని కొనాలనే ఆలోచన మనకు వచ్చినా… క్రెడిట్ కార్డు రెచ్చగొడుతుంది. డెబిట్ కార్డులో డబ్బులు లేకపోతే సైలెంట్ గా ఉంటాం.
వడ్డీ పైన వడ్డీ, గుప్త రుసుములు, అపరాధ రుసుములు లాంటివి కూడా ఉన్నాయి. 100 రూపాయల అప్పును 200 రూపాయలు అప్పుగా తక్కువ మార్చేసే అవకాశం ఉంటుంది. ఫలితంగా మనం కొనే వస్తువు… ధర పెరుగుతుంది. అర్ధం కాలేదా…? ఇప్పుడు వంద రూపాయల పెట్టి వస్తువు కొంటే… మార్కెట్ లో దాని వాస్తవ ధర ఆరు నెలలకు 90 రూపాయలు అయింది అనుకుందాం. అదే క్రెడిట్ కార్డులో కొని ఆరు నెలల తర్వాత కడితే ఇప్పుడు కొన్న వస్తువుకి అప్పుడు 200 కట్టాలి.