టాలీవుడ్ హీరో శ్రీ విష్ణు ప్రధాన పాత్రలో చైతన్య దంతులూరి దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం భళా తందనాన. కేథరిన్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాను వారాహి చలన చిత్ర బ్యానర్ పై రజిని కొర్రపాటి నిర్మిస్తున్నారు. అలాగే ప్రముఖ మ్యూజిక్ డైరెక్టర్ మెలోడీ బ్రహ్మ మణిశర్మ సంగీతం అందిస్తున్నారు.
ఈ సినిమాకు సంబంధించి విడుదలైన లుక్స్, సాంగ్స్, టీజర్ ప్రేక్షకులను ఆకట్టుకోవడమే కాకుండా సినిమాపై అంచనాలను పెంచింది. కాగా తాజాగా రాసానిలా అంటూ సాగే సాంగ్ ప్రోమోను మేకర్స్ రిలీజ్ చేశారు.
ఈ సాంగ్ కు లిరిక్స్ శ్రీ మణి రాయగా అనురాగ్ కులకర్ణి, రమ్య బెహరా లు పాడారు. కాగా ఈ సినిమాకు సంబంధించిన ఫుల్ సాంగ్ ను శనివారం సాయంత్రం 5 గంటల 30 నిమిషాలకు రిలీజ్ చేయబోతున్నట్లు అనౌన్స్ చేశారు.
ఇక ఈ సినిమాలో గరుడ రామ్, పోసాని కృష్ణ మురళి కీలక పాత్రల్లో నటించారు.