అప్పట్లో హీరోయిన్లకు హీరోలకు ఉన్న ఇమేజ్ ఉండేది. సావిత్రి, జమున, విజయ నిర్మల, భానుమతి ఇలా కొందరు హీరోయిన్లు హీరోలకు సైతం సవాల్ చేసిన పరిస్థితి ఉండేది. స్టార్ హీరోల సినిమాల్లో నటించే హీరోయిన్లు అంటే చాలు నిర్మాతలు సైతం భయపడి జాగ్రత్తగా ఉండేవారు. భానుమతి విషయంలో అయితే కాస్త భయం భయంగా ఉండేవారు అని అంటారు. ఆమెతో షూట్ అంటే కంగారు పడేవారు.
ఎన్టీఆర్, కృష్ణ, అక్కినేని లాంటి హీరోలు సైతం ఆమె విషయంలో జాగ్రత్తగా ఉండేవారు. రోమాన్స్ వంటి సీన్స్ చేయడానికి ఆమె నో అనేవారు అని అంటారు. దీనితో అలాంటి పాత్రలు ఉంటే సావిత్రి లేదా ఇతర హీరోయిన్లను ఎంపిక చేసేవారు. ఇలా ఒక సందర్భంలో కృష్ణకు భానుమతికి మధ్య గొడవ అయింది. పండంటి కాపురం అనే సినిమాకు భానుమతిని ఎంపిక చేసారు కృష్ణ. కృష్ణను ఆమె తమ్ముడు అని పిలిచేవారు.
ఇక పండంటి కాపురం కథ కూడా ఆమెకు చెప్పారు. ఆమె కూడా కథ నచ్చి ఒకే అన్నారు. అయితే కొన్ని రోజులకు గాను ఒక నిర్మాత కృష్ణ వద్దకు వచ్చి ఆమెతో షూటింగ్ అంటే మాటలు కాదు వద్దు అని అన్నారట. దీనితో కృష్ణ ఆలోచనలో పడి కొన్ని రోజులకు ఆమెను పక్కన పెట్టారు. జమునను హీరోయిన్ గా ఎంపిక చేసారు. ఈ విషయం తెలిసిన భానుమతి సీరియస్ అయి వెంటనే అలాంటి కథతో ఒక సినిమా చేయాలని చూసారట. ఎవరూ సహకరించకపోవడంతో ఆగిపోయారు.