సాగు చట్టాలకు వ్యతిరేకంగా రైతు సంఘాలు పిలుపునిచ్చిన భారత్ బంద్ కొనసాగుతోంది. ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం 6గంటల వరకు ఈ బంద్ కొనసాగనుంది. రైలు, రోడ్డు రవాణా సర్వీసులను బ్లాక్ చేయాలని రైతు నేతలు పిలుపునివ్వడంతో.. పలుచోట్ల ఉదయం నుంచే రవాణా సేవలు నిలిచిపోయాయి. అంబులెన్స్, అత్యవసర సేవలు మినహా అన్నింటినీ అడ్డుకుంటామని ఇప్పటికే రైతు సంఘాలు నేతలు డిమాండ్ చేశారు.
ఏపీలో ఉదయం నుంచే జిల్లాల్లో బస్సులు నిలిచిపోయాయి. టీడీపీ, వామపక్షాలు డిపోల ముందు బైఠాయించాయి. దీంతో బస్సులు బయటకు రాలేదు. భారత్ బంద్‌కు కాంగ్రెస్, ఎస్‌పీ, ఆప్, టీడీపీ, వైసీపీ సహా పలు పార్టీలు మద్దతు ప్రకటించాయి.12 గంటల పాటు బంద్ జరగనుండటంతో.. జనజీవనంపై ప్రభావం పడనుంది.
వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలని డిమాండ్‌తో 4 నెలలుగా ఢిల్లీ సరిహద్దుల్లో వేలాది మంది రైతులు ఆందోళన చేస్తున్నారు.