కేంద్ర ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా కేంద్ర కార్మిక యూనియన్లు సమ్మె బాటపట్టాయి. 25 కోట్లకు పైగా మంది కార్మికులు దేశవ్యాప్తంగా ఆందోళనకు దిగుతున్నారు. బీజేపీకి అనుబంధ భారతీయ మజ్దూర్ సంఘ్ మినహా మిగతా కార్మిక సంఘాలన్నీ ఈ సమ్మెలో పాలుపంచుకుంటున్నాయి. కేంద్రం ఇటీవల తీసుకొచ్చిన నూతన వ్యవసాయ, కార్మిక చట్టాలను వ్యతిరేకించడంతో పాటు.. సమ్మె సందర్భంగా పలు డిమాండ్లను కేంద్రం ముందుంచాయి కార్మిక సంఘాలు.
సమ్మెకు మద్దతుగా చాలా రాష్ట్రాల్లో ఆటో, టాక్సీ డ్రైవర్లు సేవలు నిలిపివేశారు. నిర్మాణ రంగం, బీడీ కార్మికులు, హ్యాకర్లు, వెండార్లు, వివిధ రంగాలకు చెందిన కూలీలు కూడా ఈ నిరసనలో పాలుపంచుకుంటున్నారు. అటు పలు బ్యాంకింగ్ యూనియన్లు కూడా ఇందులో పాల్గొంటున్నాయి. దీంతో బ్యాంక్ సేవలను కొంత అంతరాయం కలిగే అవకాశముంది.
సమ్మె డిమాండ్లలో ప్రధానమైనవి..
-రైతు వ్యతిరేక చట్టాలు, కార్మిక వ్యతిరేక కోడ్‌లను వెనక్కి తీసుకోవాలి
-ప్రభుత్వరంగ సంస్థల ప్రైవేటీకరణను నిలిపివేయాలి
-గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని ఏడాదిలో 200 రోజులకు పెంచాలి
-ఆదాయ పన్ను చెల్లించని కుటుంబాలకు నెలకు 7,500 నగదు బదిలీ చేయాలి