కరోనా వైరస్ నివారణ వ్యాక్సిన్‌ను అభివృద్ధి చేస్తున్న భారత్ బయోటెక్ ఔషధ నియంత్రణ సంస్థకు కీలక విజ్ఞప్తి చేసింది. తాము రూపొందిస్తున్న కోవాగ్జిన్‌కు అత్యవసర వినియోగానికి అనుమతి ఇవ్వాలని కోరింది. ఇప్పటికే ఫైజర్, సీరం ఇనిస్టిట్యూట్ కూడా తాము అభివృద్ది చేస్తున్న వ్యాక్సిన్‌ల అత్యవసర వినియోగం కోసం దరఖాస్తు చేశాయి. అయితే అనుమతి ఇచ్చే విషయంపై సీడీఎస్‌సీవో (కేంద్ర ఔషధ ప్రమాణాల నియంత్రణ సంస్థ)లోని నిపుణుల కమిటీ రేపు నిర్ణయం తీసుకోనుంది.
భారత్ బయోటెక్, ఐసీఎంఆర్ సంయుక్త భాగస్వామ్యంలో కొవాగ్జిన్‌ను రూపొందుతోంది. ఇటీవలే ఈ వ్యాక్సిన్ పురోగతిని పరిశీలించేందుకు ప్రధాని మోదీ హైదరాబాద్ కూడా వచ్చి వెళ్లారు. దేశంలో మరి కొద్దివారాల్లోనే కరోనా వ్యాక్సిన్ సిద్ధం కాబోతోందని ఇటీవల జరిగిన అఖిలపక్ష సమావేశంలో ప్రధాని అశాభావం వ్యక్తం చేశారు.