భారత్ జోడో యాత్ర ఆంధ్రప్రదేశ్ లోకి ప్రవేశించింది. నేడు ఉదయం కర్ణాటకలోని చిత్ర దుర్గంలో యాత్ర ప్రారంభం కాగా తాజాగా ఏపీలో అనంతపురం జిల్లాలోని డి. హిరేహాల్ కు చేరుకుంది.
యాత్రకు ఏపీ కాంగ్రెస్ అధ్యక్షుడు శైలజానాథ్, మాజీ పీసీసీ చీఫ్ రఘువీరారెడ్డిలు ఘన స్వాగతం పలికారు.
డి.హీరేహాల్ లోని మారెమ్మ ఆలయం వద్ద కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ విశ్రాంతి తీసుకోనున్నారు.
యాత్ర మధ్యాహ్నం సమయానికి డి.హిరేహాల్ మండల కేంద్రానికి చేరుకోనుంది. అక్కడి నుంచి సుమారుగా 12 కిలోమీటర్లు ప్రయాణించనున్నారు
అనంతరం యాత్ర అక్కడి నుంచి ఓబుళా పురం మీదుగా కర్ణాటకలోని బళ్లారికి చేరుకుంటుంది. బళ్లారిలోని హలకుంది మఠ్‌లో రాత్రి ఆయన విశ్రాంతి తీసుకోనున్నారు.