సంచలన దర్శకుడు శంకర్ దర్శకత్వంలో విశ్వనటుడు కమల్ హాసన్ కాంబినేషన్ తెరకెక్కుతున్న చిత్రం భారతీయుడు 2. అయితే ప్రస్తుతం ఓ వార్త కోలీవుడ్ లో చక్కర్లు కొడుతుంది. భారతీయుడు 2 సినిమా ఆగిపోయిందని పుకార్లు మీద పుకార్లు వచ్చాయి. అయితే ఈ వార్తల్లో నిజం లేదని నిర్మాతలు స్పష్టం చేశారు.
ఈ సినిమా 1996లో వచ్చిన భారతీయుడు చిత్రానికి సీక్వెల్ గా వస్తున్న ఈ సినిమాలో కాజల్ అగర్వాల్, రకుల్ ప్రీత్ సింగ్, సిద్ధార్థ్, ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు. గతంలో పలు సార్లు ఈ సినిమా ఆగిపోయిందని వార్తలు వచ్చాయి.తాజాగా మరోసారి కూడా ఈ సినిమా ఆగిపోయిందని వార్తలు వచ్చాయి. లైకా నిర్మాణ సంస్థ ప్రతినిధులు స్పందిస్తూ భారతీయుడు2 చిత్రం షూటింగ్ సుమారు 60 శాతం పూర్తయింది. ఇంత పూర్తి చేశాక సినిమాను ఎందుకు ఆపుతాము, లాక్ డౌన్ పూర్తయిన వెంటనే షూటింగ్ మొదలుపెడతాం అని పేర్కొన్నారు.