తమ వ్యాక్సిన్ ను నీళ్లతో పోల్చటంపై భారత్ బయోటెక్ తీవ్ర ఆగ్రహాం వ్యక్తం చేయటం పెద్ద దుమారాన్నే రేపింది. ఇటు దేశీయ సంస్థపై ఇన్ని ఆరోపణాల అంటూ వస్తున్న విమర్శల నేపథ్యంలో… భారత్ బయోటెక్, సీరం సంస్థలు వివాదానికి పుల్ స్టాప్ పెడుతూ సంయుక్త ప్రకటన చేశాయి.
దేశానికి, ప్రపంచానికి టీకాలు అందించాలన్నదే తమ లక్ష్యమని, కరోనా నుంచి ప్రజలను కాపాడటమే తమ ప్రధాన కర్తవ్యమని పేర్కొన్నాయి. ఈ రెండు వ్యాక్సిన్స్ కు ప్రజలను కాపాడే సత్తా ఉందని, వ్యాక్సిన్స్ వల్ల ప్రపం ఆర్థిక వ్యవస్థ గాడిలో పడుతుందని ధీమా వ్యక్తం చేశాయి. మా వ్యాక్సిన్స్ కు అత్యవసర వినియోగానికి అనుమతి వచ్చిందని, ఇప్పుడు మా దృష్టంతా టీకాల తయారీ, సరఫరా, పంపిణీపై దృష్టి సారిస్తున్నామని ఇరు సంస్థలు సంయుక్తంగా ప్రకటించాయి.
అత్యంత నాణ్యత, భద్రతతో కూడిన టీకాలు అందిస్తామని, వ్యాక్సిన్‌ను ప్రజలందరికీ అందుబాటులోకి తేవడం మా విధి అని తెలిపాయి ప్రపంచానికి సురక్షిత వ్యాక్సిన్లు అందిస్తామని ప్రతిజ్ఞ చేస్తున్నట్లు ప్రకటన విడుదల చేశాయి.