రెండు సంవత్సరాల వయస్సు పిల్లలకు కూడా కరోనా వ్యాక్సిన్ ఇవ్వొచ్చంటున్నారు భారత్ బయోటెక్ సంస్థ అధినేత. తాము తయారు చేసిన కోవాక్జిన్ ను 12 సంవత్సరాల పైబడిన పిల్లలకే ఇవ్వాలని డీసీజీఐ అనుమతిచ్చింది. అయితే, తమ వ్యాక్సిన్ 2 సంవత్సరాల పిల్లల నుండి కూడా వాడొచ్చంటున్నారు భారత్ బయోటెక్ చైర్మన్ కృష్ణ ఎల్ల.
గ్లోబల్ బయోటెక్ కంపెనీ మెడెర్నా కూడా 2022వరకు పిల్లలపై వ్యాక్సిన్ వద్దని నిర్ణయించింది. కానీ భారత్ బయోటెక్ మాత్రం తమ వ్యాక్సిన్ పిల్లలకు పనిచేస్తుందంటూ ప్రకటించింది. తాము తయారు చేసిన వ్యాక్సిన్… ప్రభావం చూపని కరోనా వైరస్ తో చేసిందని, దీన్ని ఎవరికైనా ఇవ్వొచ్చని ప్రకటించారు.
మరో 10రోజుల్లో తాము నిపుణుల కమిటీ, డీసీజీఐకి అధికారికంగా దరఖాస్తు చేసుకుంటామని ఆయన ప్రకటించారు. తన ఆరేళ్ల మనువడికి కూడా ఈ వ్యాక్సిన్ ఇచ్చేందుకు తాను రెడీగా ఉన్నట్లు తెలిపారు.
భారత్ బయోటెక్ తయారు చేసిన కోవాక్జిన్ అనే కరోనా వ్యాక్సిన్ ను డీసీజీఐ అత్యవసర వ్యాక్సినేషన్ కు అనుమతిచ్చింది.