కరోనా వ్యాక్సిన్ కు భారత్ బయోటెక్ సంస్థ తయారు చేసిన కోవాక్జిన్ అత్యుత్తమ నాణ్యత ప్రమాణాలు, భద్రతతో కూడుకొని ఉంటుందని సంస్థ ఎండీ కృష్ణ ఎల్లా ప్రకటించారు. చెన్నై ఇంటర్నేషనల్ సెంటర్ సభ్యులతో జరిగిన సంభాషణలో కోవాక్జిన్ ను ఎప్పుడు లాంచ్ చేస్తారన్న అంశంపై మాత్రం సమాధానం నిరాకరించారు.
వ్యాక్సిన్ తయారీకి తమపై ఒత్తిడి ఉందని, ఇది దేశానికే ప్రతిష్టాత్మక అంశం అని, అయినప్పటికీ తాము అంతర్జాతీయ నిబంధనలకు లోబడే క్లినికల్ ట్రయల్స్ చేస్తున్నామన్నారు. ప్రస్తుతం రెండో దశలోకి ఎంటరైపోయామని, గతంలో రోటా వైరస్ ఫస్ట్ ఫేజ్ క్లినికల్ ట్రయల్స్ కు 6నెలల సమయం పడితే, ఇప్పుడు కోవాక్జిన్ ను ఒకే నెలలో పూర్తి చేశామన్నారు. చైనా సహా పలు అంతర్జాతీయ స్థాయిలో పోటీపడే అర్హత భారతీయ ఫార్మా రంగానిదన్న ఆయన గతంలో రోటావైరస్ వ్యాక్సిన్ ను జీఎస్కే సంస్థ 85డాలర్లకు ఆవిష్కరిస్తే, తాము కేవలం ఇక్క డాలర్ కే ఇచ్చినట్లు గుర్తు చేశారు.
ఇప్పుడు కూడా కరోనా వ్యాక్సిన్ అందరికీ అందుబాటులో, సరసమైన ధరలోనే ఉంటుందని ఆయన స్పష్టం చేశారు.