వ్యాక్సిన్ తీసుకున్న వారిలో పలువురికి ఆరోగ్య సమస్యలు తలెత్తాయన్న వార్తలు వినిపిస్తున్నాయి. ముఖ్యంగా భారత్ బయోటెక్ సంస్థ తయారు చేసిన కోవాక్జిన్ తీసుకునేందుకు పలువురు వెనుకాముందాడుతున్నారు. ఈ నేపథ్యంలో భారత్ బయోటెక్ కీలక ప్రకటన చేసింది. టీకాను ఎవరు తీసుకోరాదనే విషయాలను తెలియజేస్తూ ఫ్యాక్ట్ షీట్‌ను విడుదల చేసింది.
కోవాక్జిన్ ఎవరు తీసుకోవద్దంటే…
1. రోగనిరోధక శక్తి తక్కువ ఉన్న వాళ్లు
2. రోగ నిరోధక శక్తిపై ప్రభావం చూపించే ఔషధాలను వాడుతున్న వారు
3. జ్వరంతో బాధపడుతున్నవారు
4. గతంలో అలర్జీ ఉన్నవారు
5. రక్తహీనత ఉన్నవారు
6. గర్భవతులు, బిడ్డలకు పాలిచ్చే తల్లులు, తీవ్రమైన ఆనారోగ్య సమస్యలు ఉన్నవారు
వ్యాక్సిన్ తీసుకునే ముందు తమ మెడికల్ హిస్టరీని గురించి వైద్యులకు, వ్యాక్సిన్ ఆఫీసర్‌లకు తెలియజేయాలని, వారి సలహాలు, సూచనల మేరకు నడచుకోవాలని కోరింది. ఫేజ్-3 ట్రయల్స్ పూర్తికాకుండానే కోవాక్జిన్ కు అనుమతి వచ్చిందన్న ఆరోపణల నేపథ్యంలో… వ్యాక్సిన్ వల్లే అనారోగ్యం పాలైన వారికి తామే పూర్తి వైద్యఖర్చులు భరిస్తామంటూ భారత్ బయోటెక్ ఇదివరకే ఒక ప్రకటన విడుదల చేసింది.