విలువలు.. విశ్వసనీయత.. అవినీతి రహిత ప్రభుత్వం.. ధోపిడిని అడ్డుకుంటాం.. ఇలాంటివన్నీ.. క్యాచీ స్లోగన్స్ తప్ప.. ఆచరించడానికి కాదు. చెప్పేటందుకే నీతులు.. చేసేటందుకు కాదంటారు కదా.. అలాగే జనాలను అట్రాక్ట్ చేయడానికే స్లోగన్స్.. ఆ స్లోగన్స్ అమలు మాత్రం జరగదు. చంద్రబాబు ప్రభుత్వం ఉన్నప్పుడు.. ఏ మీటింగ్ జరిగినా హెరిటేజ్ మజ్జిగ ప్యాకెట్లు పంచారనే ఆరోపణలు వచ్చాయి.. కేసు కూడా నమోదు చేసింది వైసీపీ ప్రభుత్వం. అలాగే హెరిటేజ్ ఎదుగుదల కోసం.. ప్రభుత్వ పాల డైరీ సంస్థలను నిర్వీర్యం చేశారనే ఆరోపణలు కూడా చంద్రబాబుపై ఉన్నాయి. వాళ్లది పాల వ్యాపారం.. మరి వీరిది.. సిమెంట్ వ్యాపారం. అవును ఆ వ్యాపారం ఇప్పుడు ఏపీలో మామూలుగా జరగడం లేదు.
భారతీ సిమెంట్స్.. దీని పుట్టుకే ఒక వివాదం. తర్వాత దీనిలో విదేశీ కంపెనీ ఎంట్రీ మరో వివాదాం. సీబీఐ ఛార్జిషీట్లలో ఈ సంస్థ కూడా ఎక్కింది. దీని వలనే.. ఏ సంబంధం లేని భారతీ మేడమ్ కూడా ఛార్జిషీట్ లోకి ఎక్కాల్సి వచ్చింది. అలాంటి కంపెనీ భారతీ సిమెంట్స్. వైసీపీ ప్రభుత్వం రాక ముందు వ్యాపారం ఎలా జరిగిందో తెలియదు గాని.. ఇప్పుడు మాత్రం దుమ్ము రేపుతోంది భారతీ సిమెంట్స్. ఎలాగో తెలుసా.. అది తెలిస్తే.. విలువలా సింగినాథమా.. అవినీతి రహితమా.. అవినీతి హితమా అని మీరే ప్రశ్నిస్తారు.
కొత్తగా గ్రామ సచివాలయాల నిర్మాణం జరుగుతోంది రాష్ట్రంలో. ఆ సచివాలయాల కాంట్రాక్ట్ పొందినవారికి స్టీల్, సిమెంట్.. సప్లయ్ అవుతాయి. వాటి విలువను.. వీరికిచ్చిన కాంట్రాక్ట్ వాల్యూలో తగ్గించి.. మిగతాది పేమెంట్ చేస్తారు. స్టీల్, సిమెంట్ బిల్లులు నేరుగా చెల్లించేస్తారు. అయితే ఇక్కడ అసలు సంగతి ఏంటంటే.. స్టీల్, సిమెంట్ రెండూ భారతీ సంస్థ నుంచే కొనుగోలు జరుగుతుంది. అధికార్లందరికీ ఆ విధంగా ఆదేశాలు వచ్చేశాయి. ఎంప్యానెల్ మెంట్ లిస్టులో భారతి సిమెంట్ తో పాటు.. ఇతర సిమెంట్ కంపెనీలు కూడా ఉంటాయి. వాటిలో భారతి సిమెంట్ నే సెలెక్ట్ చేసి.. వారికే ఆర్డర్ ఇవ్వాలి.. దానినే కాంట్రాక్టర్ వాడాలి. మధ్యలో ఎవరూ అడిగేది లేదు.. అడగటానికి అవకాశమే లేదు. అలా రాష్ట్రమంతా సచివాలయాల నిర్మాణంలో మొత్తం భారతి సిమెంట్ దే వ్యాపారం.
ఇవే కాకుండా.. రాష్ట్రంలో ప్రభుత్వ నిర్మాణాలు ఏం జరిగినా.. కాంట్రాక్టర్ ఎవరైనా సరే.. కొనాల్సింది భారతి సిమెంట్ మాత్రమే. ఖచ్చితంగా అన్నిటిలోనూ చేస్తున్నారని చెప్పడానికి పూర్తి వివరాలు లేవు గాని.. మాగ్జిమమ్ అన్నిటిలోనూ ఇదే ఫార్ములా అమలు చేస్తున్నారు. అలా భారతి సిమెంట్స్ వ్యాపారం.. వైసీపీకి అధికారం రావటంతో ఉవ్వెత్తున ఎగసిపడుతోంది. ఇలా ఎవరికీ తెలియకుండా.. ఎవరికీ కనపడకుండా.. బిజినెస్ బై కంపల్షన్ కాన్సెప్ట్ తో .. ప్రభుత్వ అధికారాన్ని అడ్డుపెట్టుకుని భారతి సిమెంట్స్ వ్యాపారాన్ని మన జగనన్న కుటుంబం పరుగులు పెట్టిస్తోంది.