డిసెంబర్ 31న తన రాజకీయ పార్టీకి సంబంధించి కొన్ని విషయాలను ప్రకటించబోతున్నానని రజినీకాంత్ చెప్పిన సంగతి తెలిసిందే. అయితే ఆరోగ్య కారణాల రీత్యా ఆ నిర్ణయాన్ని వెనక్కి తీసుకుంటున్నానని తాజాగా రజనీకాంత్ అనౌన్స్ చేశారు. ఇక రజనీ పొలిటికల్ ఎంట్రీ పై వెనకడుగు వేయడంతో కమల్ హాసన్ తో పాటు కొంతమంది రాజకీయ నాయకులు కూడా స్పందించారు.
తాజాగా దర్శకుడు భారతీరాజా కూడా కీలక వ్యాఖ్యలు చేశారు. రజినీకాంత్ నిర్ణయాన్ని స్వాగతిస్తున్నామని..రజనీ రాజకీయ ఊబిలో దిగడం మంచిది కాదని చెప్పుకొచ్చారు. నా మిత్రుడు రజినిని గొప్ప నటుడిగా గౌరవిస్తానని కానీ వేరే ప్రాంతానికి చెందిన రజినిని రాజకీయ నేతగా ఒప్పుకోనని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తమిళనాడులో తమిళులే సీఎం గా ఉండాలని రజినీకాంత్ రాజకీయాలకు రాకపోవడం ఆరోగ్యరీత్యా మంచిదని భారతీరాజా వ్యాఖ్యలు చేశారు.