హాఫీజ్ పేట భూముల వ్యవహరంలో జరిగిన బోయినపల్లి కిడ్నాప్ కేసులో ఏ3 భార్గవ్ రామ్ హైకోర్టును ఆశ్రయించాడు. ముందస్తు బెయిల్ ఇవ్వాలంటూ మాజీ మంత్రి, ఏ1 అఖిలప్రియ భర్త భార్గవ్‌రామ్ కోర్టును కోరాడు.
సికింద్రాబాద్ కోర్టు ముందస్తు బెయిల్ పిటిషన్ కొట్టివేయడంతో హైకోర్టులో పిటిషన్ వేశాడు. భార్గవ్‌రామ్ పిటిషన్‌ను న్యాయస్థానం గురువారం విచారించనుంది. బోయిన్‌పల్లి కిడ్నాప్ కేసులో భార్గవ్‌రామ్ ప్రస్తుతం పరారీలో ఉన్నారు. తెలంగాణ పోలీసులు బృందాలుగా ఏర్పడి గాలింపు చేస్తున్నారు.