(భార్గవ్, బుల్లితెర యాంకర్)
నమస్కారమండీ!
బాగున్నారా..? ఈరోజు తెలుగు భాషా దినోత్సవమండీ..
కనీసం ఈరోజయినా రోజంతా చక్కగా తెలుగులోనే మాట్లాడదామని అనుకుంటున్నానండీ..
తెలుగులోనే మాట్లాడుకుందాం..
తెలుగును కాపాడుకుందాం..
ఇదండీ ఇవాళ నా నినాదం… నా విధానం..
ఏమండీ.. తెలియక అడుగుతున్నా.. ఏమనుకోకండీ..
ఫేసుబుక్కులో.. వాట్సాప్‌లో… తెలుగును ఇంగ్లిషులో రాస్తారెందుకండీ…
ఎంచక్కా గూగుల్ ఇండిక్ కీబోర్డు ఇన్‌స్టాల్ చేసుకుంటే తెలుగులోనే టైప్ చేసుకోవచ్చు కదా..?
ఇంత చిన్న లాజిక్ ఎలా మిస్సవుతున్నారండీ…
అమ్మో.. తెలుగులో మాట్లాడాలనుకున్నా ఇంగ్లిష్ వచ్చేస్తోందండీ..
అంతగా మన భాష సంకరం అయిపోయిందండీ..
కొన్ని పదాలు తప్పవులేండి?
రోడ్డు..మీద యాక్సిడెంట్.. అయ్యింది… అనేస్తాం.. అదే రహదారి మీద ప్రమాదం జరిగింది.. అని చెప్పగలమా? కాస్త కామెడీగా కూడా వుంటుంది.
కాబట్టి కామ్రెడ్స్.. నేన్చెప్పేదేంటంటే.. మ్యాక్సిమమ్ తెలుగులోనే మాట్లాడుదాం.. ఇంగ్లిష్ ఎక్కడ అవసరమో అక్కడే వాడదాం..
నేనలా అనుకున్నాను. మరి మీరు కూడా ఈరోజే ఈ నిర్ణయం తీసుకోండి.
తెలుగును ఎవరొచ్చి కాపాడుతారండీ.. మనకు మనమే రక్షించుకోవాలి.
తమిళనాడులో చూడండి.. తమిళంలో టైటిల్ పెడితేనే ప్రభుత్వం అక్కడ సినిమాలకు రాయితీలు ఇస్తుంది.
అక్కడ ఏ షాపు బోర్డు చూసినా తమిళంలోనే వుంటుంది.
మనం తెలుగును కూడా ఇంగ్లిష్ చేసి రాస్తున్నాం.
మారాలండీ మనం..