సంస్కృతాంధ్ర శాస్త్ర పండితులు బ్రహ్మశ్రీ శాస్త్రుల భార్గవ రామశర్మ కన్నుమూశారు. కొంతకాలంగా అనారోగ్యం కారణంగా ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్సపొందుతూ సోమవారం తుదిశ్వాస విడిచారు.
మెదక్ జిల్లా శివంపేటలో 1946లో జన్మించారు రామశర్మ. అనేక శాస్త్రాలను అధ్యయనం చేశారు. వరంగల్లులోని దుర్గేశ్వర సంస్కృతాంధ్ర కళాశాలలో సంస్కృతోపన్యాసకులుగా నాలుగు దశాబ్దాల పాటు సేవలు అందించారు. ఎన్నో పురస్కారాలు, సత్కారాలు పొందారు. 2018లో తెలంగాణ విద్వత్సభ జీవనసాఫల్య విశిష్ట సేవా పురస్కారం అందుకున్నారు రామశర్మ.