ఇండియన్ సినిమాలో మర్చిపోలేని సినిమాలు చేసిన దర్శకులు కొందరు ఉన్నారు. మన దక్షిణ భారతదేశంలో ఈ సంఖ్య కాస్త ఎక్కువే అని చెప్పాలి. అందులో భారతి రాజా ఒకరు. ఆయన చేసిన సినిమాలు, ఆ సినిమాల్లో ఉండే నేపధ్యం అన్నీ కూడా ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంటాయి అనే మాట వాస్తవం. అన్ని వర్గాల ప్రేక్షకులకు దగ్గరయ్యే విధంగా ఆయన సినిమాలు చేసారు.
ఆయన చేసిన మొదటి సినిమా 16 వాయతినిలే అని తమిళంలో విడుదలైంది. ఈ సినిమాకు అవార్డులు కూడా వచ్చాయి. అదే సినిమాను తెలుగులో రీమేక్ చేసారు. శ్రీదేవి హీరోయిన్ గా 16 ఏళ్ళ వయసు పేరుతో ఈ సినిమా వచ్చింది. ఉత్తమ దర్శకుడిగా ఆయనకు అవార్డు వచ్చింది. పల్లెటూరి నేపధ్యంలో ఈ సినిమా వచ్చింది. కిజకే పోగుం రైల్ పే అనే రెండో సినిమా కూడా సూపర్ హిట్ అయింది.
ఈ సినిమా కూడా తెలుగులో రీమేక్ చేసారు. ఈ సినిమా కూడా పల్లెటూరి నేపధ్యంలోనే వచ్చింది. ఆయన పల్లెటూరి నేపధ్యంలోనే సినిమాలు చేస్తారనే పేరు వచ్చింది. కాని ఆ అపవాద నుంచి వేగంగా బయటకు వచ్చారు. మూడో సినిమాను ముంబై క్రైం సీన్ నేపధ్యంలో చేసారు. కమల్ హాసన్ హీరోగా వచ్చిన ఈ సినిమా చాలా మందికి సమాధానం చెప్పింది. తెలుగులో ఎర్ర గులాబీలు అనే పేరుతో తెలుగులో వచ్చి ఇక్కడ కూడా మంచి హిట్ అయింది.