భూస్వాముల కోసమే ప్రభుత్వం రెవెన్యూ ప్రక్షాళన కార్యక్రమం చేపట్టిందని శాసనసభాపక్షనేత భట్టి విక్రమార్క ఆరోపించారు. రెవెన్యూ ప్రక్షాళన పేరుతో రైతులకు ఒరిగిందేమీ లేదని…పైగా సమస్యలు మరిన్ని పెరిగాయన్నారు. ప్రభుత్వ వైఖరితో అధికారులపై దాడులు జరుగుతున్నాయని చెప్పారు. ప్రభుత్వ విధానాలపై ప్రజల్లో తిరుగుబాటు మొదలైందని తెలిపారు. నకిలీ విత్తనాలతో రైతులు నష్టపోతున్నారని… నకిలీ విత్తనాలను బయటపెట్టిన అధికారులనే ప్రభుత్వం సస్పెండ్ చేసిందని అన్నారు. పార్టీలకు చందాలు ఇచ్చే అక్రమ విత్తన కంపెనీలకు అనుమతులు ఇస్తున్నారని ఆరోపించారు. నకిలీ విత్తన కంపెనీలపై ప్రభుత్వం చర్యలు తీసుకోవడం లేదని విమర్శించారు.