రాజస్తాన్ కు చెందిన 32 ఏళ్ల భావన టోక్యో ఒలంపిక్స్ కు నడక పోటీల్లో అర్హత సాధించింది. నడక పోటీల్లో 1 గంట 29 నిమిషాల 54 సెకండ్లలలో గమ్యాన్ని చేరుకొని సరికొత్త జాతీయ రికార్డ్ ను సృష్టించింది. 1 గంట 31 నిమిషాల ఒలంపిక్స్ క్వాలిఫైయింగ్ టైమ్ లోపల గమ్యాన్ని చేరుకొని టోక్యో ఒలంపిక్స్ కు అర్హత సాధించింది. గతంలో 1:38:30గం. జాతీయ రికార్డ్ ను బ్రేక్ చేసింది భావన.
రాత్రుళ్లు ప్రాక్టీస్ :
భావన లోని టాలెంట్ ను గుర్తించిన PET భావనను ప్రోత్సాహించాడు. పగలు ప్రాక్టీస్ చేయడం సాధ్యపడక పోవడంతో రాత్రిళ్లు ప్రాక్టీస్ చేయించేవాడు. అమ్మాయి షార్ట్ వేసుకొని ప్రాక్టీస్ చేయడాన్ని ఆ గ్రామస్తులు ఒప్పుకోకపోవడంతో వాళ్లకు నచ్చజెప్పి ఆ అమ్మాయికి అండగా నిలబడ్డాడు.
నడక పోటీల్లో పాల్గొనడానికి షూస్ లేకపోవడంతో కొంత మంది స్నేహితుల వద్ద అడుక్కునేది…కొందరు ఫ్రీగా ఇస్తే ఇంకొందరు ఆ షూస్ కు కిరాయి వసూలు చేసేవారు.! అయినా తన అవసరం కోసం కిరాయికి తీసుకొని మరీ ప్రాక్టీస్ చేసేది భావన.
భావన ప్రతిభను గుర్తించిన శాయ్ బెంగుళూరులో శిక్షణ ఇప్పించింది. 2020 ఫిబ్రవరిలో జరిగిన నేషనల్ గేమ్స్ లో 1 గంట 29 నిమిషాల 54 సెకండ్ల బెస్ట్ టైమ్ తో రేస్ ముగించింది. ఈ టైమింగ్ రియో ఒలంపిక్స్ లో బ్రాంజ్ మెడలిస్ట్ కు సమానం….అంటే ఇంకాస్త ప్రయత్నిస్తే భావన ఒలంపిక్స్ లో ఇండియాకు పతకం తేవడం గ్యారెంటీ అన్నమాట!