పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ వరుస సినిమాలను చేస్తున్నాడు. ప్రస్తుతం హరిహర వీరమల్లు, భీమ్లా నాయక్ సినిమాలు చేస్తున్నాడు. దీంతో పాటు హరీష్ శంకర్ దర్శకత్వంలో కూడా భవదీయుడు భగత్ సింగ్ సినిమా చేస్తున్నాడు. ఇక పవన్ పుట్టిన రోజు సందర్భంగా… ఈ సినిమా ప్రీ లుక్ విడుదలైంది. కాగా తాజాగా ఈ సినిమాకు సంబంధించిన ఓ అప్డేట్ బయటికి వచ్చింది.
అది ఏంటంటే విజయదశమి రోజున… అక్టోబర్ 15న చిత్రీకరణ స్టార్ట్ కాబోతున్నట్లు తెలుస్తోంది. అలాగే ఇందులో పవన్ కళ్యాణ్ ఒక లెక్చరర్ గా నటిస్తున్నట్లు సమాచారం. అలాగే పూజా హెగ్డే హీరోయిన్ గా నటిస్తుంది. గతంలో పవన్ హరీష్ కాంబినేషన్ లో గబ్బర్ సింగ్ సినిమా వచ్చింది. ఈ సినిమా సూపర్ డూపర్ హిట్ కొట్టింది. మరి ఈ సినిమా ఎలాంటి సక్సెస్ సాధిస్తుందో చూడాలి.