సాగర్ కె చంద్ర దర్శకత్వంలో రానా, పవన్ కళ్యాణ్ హీరోలుగా నటించిన చిత్రం భీమ్లా నాయక్. ఫిబ్రవరి 25న రిలీజ్ అయిన ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద మంచి విజయం సాధించింది. అలాగే మాస్ ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంది.
కాగా తాజాగా మేకర్స్ భీమ్లా నాయక్ బ్యాక్ ఆన్ డ్యూటీ పాటను విడుదల చేశారు. ఈ సాంగ్ విడుదల అయిన నిమిషాల్లోనే సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. వీడియో సాంగ్‌లో పవన్ కళ్యాణ్ మాస్ లుక్ లో కనిపించారు. అలాగే రానా, త్రివిక్రమ్ శ్రీనివాస్ కూడా ఇందులో ఉన్నారు.
రోల్ రైడా ఈ పాటకు పవర్ ఫుల్ లిరిక్స్ రాశారు. వైష్ణవి కొవ్వూరి, ప్రత్యూష పల్లపోతు, రచిత రాయప్రోలు, పర్ణిక, రీటా త్యాగరాజన్, లక్ష్మీ మేఘన పాడగా థమన్ మ్యూజిక్ అందించారు.
ఇక భీమ్లా నాయక్ చిత్రంలో పవన్ కళ్యాణ్, రానా, నిత్యా మీనన్, సంయుక్త మీనన్ లు ప్రధాన పాత్రలు పోషించగా, త్రివిక్రమ్ శ్రీనివాస్ డైలాగ్స్, స్క్రిప్ట్ అందించారు.