విజయ్ దేవరకొండ నటిస్తున్న తొలి పాన్ ఇండియా మూవీ లైగర్. అటు పవన్ కల్యాణ్ నటిస్తున్న భారీ యాక్షన్ సినిమా భీమ్లానాయక్. ఇప్పుడీ రెండు సినిమాలు ఒకేసారి భారీ డీల్స్ సెట్ చేసుకున్నాయి. కళ్లు చెదిరే రీతిలో కోట్ల రూపాయలు కొల్లగొట్టాయి.
పూరి జగన్నాధ్ దర్శకత్వంలో విజయ్ దేవరకొండ హీరోగా నటిస్తున్న సినిమా లైగర్. ఈ సినిమా శాటిలైట్, డిజిటల్ రైట్స్ ను స్టార్ మా ఛానెల్ దక్కించుకుంది. ఈ మొత్తం డీల్ విలువ దాదాపు 68 కోట్ల రూపాయలు. విజయ్ దేవరకొండ కెరీర్ లోనే బిగ్గెస్ట్ డీల్ ఇది. సినిమా రిలీజైన తర్వాత ఈ సినిమాను ముందుగా డిస్నీ హాట్ స్టార్ లో స్ట్రీమింగ్ కు పెడతారు. ఆ తర్వాత కొన్ని రోజులకు స్టార్ మా ఛానెల్ లో ప్రసారం చేస్తారు.
ఇటు భీమ్లానాయక్ కూడా భారీ డీల్ లాక్ చేసుకుంది. ఈ సినిమా డిజిటల్ రైట్స్ ఇప్పటికే అమ్ముడుపోయాయి. అయితే అది ఏ సంస్థకు అనే విషయాన్ని మాత్రం మేకర్స్ బయటపెట్టడం లేదు. కొంతమంది అమెజాన్ ప్రైమ్ అంటారు, మరికొంతమంది ఆహా అంటారు. లేటెస్ట్ అప్ డేట్ ప్రకారం, ఆహా దగ్గరే ఈ సినిమా రైట్స్ ఉన్నట్టు తెలుస్తోంది. ఈ కన్ఫ్యూజన్ కు ఓ కారణఁ కూడా ఉంది. ముందుగా ఈ సినిమా డిజిటల్ రైట్స్ ను బీ4యు అనే సంస్థకు అమ్మేశారు. అట్నుంచి అటు ఆ హక్కులు ఎటు వెళ్లాయనేది చాలామందికి తెలియడం లేదు.
ఇక ఈ సినిమా శాటిలైట్ రైట్స్ డీల్ తాజాగా క్లోజ్ అయింది. స్టార్ మా ఛానెల్ ఈ సినిమా హక్కుల్ని దక్కించుకుంది. అటు ఇటుగా 21 కోట్ల రూపాయలకు భీమ్లానాయక్ శాటిలైట్ రైట్స్ అమ్ముడుపోయినట్టు తెలుస్తోంది. ఫిబ్రవరి 25న ఈ సినిమా థియేటర్లలోకి వస్తోంది.
పవన్ కల్యాణ్ హీరోగా నటిస్తున్న ఈ సినిమాకు త్రివిక్రమ్ స్కీన్ ప్లే-మాటలు అందిస్తున్నాడు. సాగర్ చంద్ర దర్శకత్వం వహిస్తున్నాడు. తమన్ సంగీతం అందిస్తున్నాడు. తాజాగా సినిమా షూటింగ్ పూర్తయింది. ప్రస్తుతం రీరికార్డింగ్ పనులు జోరుగా సాగుతున్నాయి.