భీమ్లా నాయక్ ఫిబ్రవరి 25న థియేటర్లలో గ్రాండ్‌గా విడుదల కాబోతుంది. ఈ మేరకు అధికారిక ప్రకటన వచ్చేసింది. పవన్ కళ్యాణ్, రానా దగ్గుబాటి ప్రధాన పాత్రలలో నటిస్తున్న ఈ సినిమాకు సాగర్ కె చంద్ర దర్శకత్వం వహించారు.
ఇదిలా ఉండగా మేకర్స్ విడుదల తేదీని వెల్లడించిన వెంటనే ఓవర్సీస్‌లో అడ్వాన్స్ బుకింగ్స్ ఓపెన్ అయ్యాయి. యునైటెడ్ స్టేట్స్‌లోని అనేక ప్రాంతాలలో మొదటి షో కు సంబంధించిన టిక్కెట్ల బుకింగ్ ఓపెన్ అయ్యాయి. ముందస్తు బుకింగ్స్ జోరుగా సాగుతున్నాయి. అయితే తెలుగు రాష్ట్రాల్లో మాత్రం ఇంకా తెరవలేదు.
అలాగే, టికెట్ బుకింగ్ పోర్టల్స్ సినిమా అధికారిక రన్ టైమ్ 2 గంటల 21 నిమిషాలు అని పేర్కొంది. మరికొద్ది రోజుల్లో దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన వెలువడనుంది.
నిత్యా మీనన్, సంయుక్తా మీనన్ కథానాయికలుగా నటిస్తున్న ఈ చిత్రానికి థమన్ సంగీతం అందిస్తుండగా సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ వారు నిర్మిస్తున్నారు.