సాగర్ కె చంద్ర దర్శకత్వంలో పవన్ కళ్యాణ్, రానా దగ్గుబాటి హీరోలుగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన చిత్రం భీమ్లా నాయక్. గత శుక్రవారం రిలీజ్ అయిన ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద దుమ్ము దులుపుతుంది. థమన్ మ్యూజిక్ , త్రివిక్రమ్ పవర్ ఫుల్ డైలాగ్స్ ఈ సినిమాకు హైలెట్ గా నిలిచాయి.
నిత్యా మీనన్, సంయుక్త మీనన్ హీరోయిన్స్ గా నటించగా మురళీ శర్మ, సముద్రఖని, రావు రమేష్ తదితరులు కీలక పాత్రలు పోషించారు. సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై సూర్యదేవర నాగవంశీ ఈ చిత్రాన్ని నిర్మించారు.
భీమ్లా నాయక్ 5 రోజుల కలెక్షన్స్ చూసుకుంటే :
నైజాం: రూ 31.19 కోట్లు
సీడెడ్ : రూ 8.88 కోట్లు
యూఏ : రూ. 6.26 కోట్లు
తూర్పు: రూ 4.69 కోట్లు
వెస్ట్: రూ 4.48 కోట్లు
గుంటూరు: రూ 4.65 కోట్లు
కృష్ణా: రూ 3.13 కోట్లు
నెల్లూరు: రూ. 2.22 కోట్లు
మొత్తం ఆంధ్ర ప్రదేశ్ మరియు తెలంగాణ: రూ 65.50 కోట్లు (రూ. 91.30 కోట్లు గ్రాస్ )
KA+ROI: రూ. 7.30 కోట్లు
ఓఎస్ : రూ 11.20 కోట్లు
టోటల్ వరల్డ్ వైడ్: రూ. 84 కోట్ల షేర్లు (రూ. 135 కోట్ల గ్రాస్)