పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, దగ్గుబాటి రానా ప్రధాన పాత్రలలో నటిస్తున్న చిత్రం భీమ్లా నాయక్. అయితే ఈ సినిమా ఫోర్త్ సింగిల్ ను మేకర్స్ డిసెంబర్ 1 10:08 నిమిషాలకు రిలీజ్ చేయబోతున్నట్లు ప్రకటించిన సంగతి తెలిసిందే. కానీ ఈ సాంగ్ రిలీజ్ ను వాయిదా వేశారు మేకర్స్.
ప్రముఖ రచయిత సిరివెన్నెల సీతారామశాస్త్రి అనారోగ్యంతో మంగళవారం మృతి చెందారు. ప్రస్తుతం అభిమానుల సందర్శనార్థం ఫిలింఛాంబర్ లో ఆయన పార్ధివ దేహాన్ని ఉంచారు. ఈ నేపథ్యంలోనే సినీ ప్రముఖులంతా కూడా అక్కడకు వెళ్లి ఆయనకు నివాళి అర్పిస్తున్నారు. ఇక సిరివెన్నెల గౌరవార్థం ఫోర్త్ సింగిల్ ను వాయిదా వేస్తున్నట్లు ప్రకటించారు భీమ్లా నాయక్ మేకర్స్. సాగర్ కె చంద్ర దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంకు ఎస్ ఎస్ థమన్ సంగీతం అందిస్తున్నారు.
Due to unforeseen circumstances, #AdaviThalliMaata song will not be coming out tomorrow! #BheemlaNayak
— Sithara Entertainments (@SitharaEnts) November 30, 2021
Advertisements