బాక్సాఫీస్ వద్ద భీమ్లా నాయక్ తగ్గేదేలే అన్నట్టు కలెక్షన్స్ రాబడుతుంది. శుక్రవారం రిలీజ్ అయిన ఈ సినిమా తెలుగు రాష్ట్రాల్లోనే కాదు ఓవర్సీస్ కూడా బాక్సాఫీస్ వద్ద దుమ్ముదులుపుతుంది.
తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం… భీమ్లా నాయక్ యూఎస్ బాక్సాఫీస్ వద్ద ప్రీమియర్లు, మొదటి రోజు $1 మిలియన్ డాలర్లను వసూలు చేసిందట. అలాగే చిత్రం శనివారం నాటికి $1.8 మిలియన్ డాలర్లకు పైగా వసూలు చేసినట్లు సమాచారం.
ఇక ఆదివారం కలెక్షన్లు కూడా భారీగానే ఉంటాయని అంచనా వేస్తున్నారు. త్వరలోనే ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద 2 మిలియన్ డాలర్లను కు సాధించే అవకాశం ఉందని ట్రేడ్ పండితులు అంచనా వేస్తున్నారు.
మొత్తానికి తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా యూఎస్ బాక్సాఫీస్ వద్ద కూడా పవన్ కళ్యాణ్ దూసుకెళ్తున్నాడనే చెప్పాలి. సాగర్ కె చంద్ర దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో రానా దగ్గుబాటి మరో హీరోగా నటించారు. నిత్యా మీనన్, సంయుక్త మీనన్ లు హీరోయిన్స్ గా నటించగా త్రివిక్రమ్ మాటలు స్క్రీన్ ప్లే అందించారు. అలాగే ఎస్ ఎస్ థమన్ సంగీతం అందించాడు.