భీమ్లా నాయక్ సినిమా శుక్రవారం రిలీజ్ కాబోతుంది. ప్రపంచవ్యాప్తంగా భారీ ఎత్తున రిలీజ్ కాబోతున్న ఈ సినిమా లో పవన్ కళ్యాణ్, రానా దగ్గుబాటి హీరోలుగా నటిస్తున్నారు. సాగర్ కె చంద్ర దర్శకత్వం వహించారు. కాగా తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం తెలుగు రాష్ట్రాలతో పాటు యుఎస్ బాక్సాఫీస్ వద్ద కూడా ప్రీ-బుకింగ్ లతో మంచి వసూళ్లను సాధిస్తుంది ఈ చిత్రం.
మొత్తం అన్ని థియేటర్లలో కలిపి ఈ చిత్రం యుఎస్ బాక్సాఫీస్ వద్ద హాఫ్ మిలియన్ డాలర్లు వసూలు చేసినట్టు తెలుస్తుంది. ఇక ఈ సినిమాని సడెన్ గా రిలీజ్ చేయాలని నిర్ణయించుకున్న చిత్ర యూనిట్, డిస్ట్రిబ్యూటర్లు మాత్రం చాలా అప్రమత్తంగా ఉన్నారు.
యుఎస్‌లోని అన్ని ఏరియాల్లో గొప్పగా విడుదల చేసేందుకు శాయశక్తులా కృషి చేస్తున్నారు.ఇప్పటివరకు, ఈ చిత్రం $ 620,000 మార్క్‌ను దాటింది.
కేవలం యుఎస్ ప్రీమియర్ నుండి $750,000 కంటే ఎక్కువ వచ్చే అవకాశం కనిపిస్తోంది. అలాగే ఆస్ట్రేలియాలో కూడా అడ్వాన్స్ అమ్మకాలు AUD100,000 కు మించిపోయాయి.