పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ స్టార్ భీమ్లా నాయక్ ఫిబ్రవరి 25, థియేటర్లలో రిలీజ్ కాబోతుంది. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించి విడుదల అయిన లుక్స్, సాంగ్స్, టీజర్, ట్రైలర్ సినిమాపై అంచనాలను పెంచాయి.
ఇదిలా ఉండగా చాలా కాలంగా ఎదురుచూస్తున్నభీమ్లా నాయక్ టిక్కెట్ల అమ్మకాలు ప్రారంభమయ్యాయి. స్టార్ట్ అయిన కొద్దిసేపటికే, హైదరాబాద్‌లోని అన్ని ప్రధాన మల్టీప్లెక్స్‌లలో టిక్కెట్లు హాట్‌కేక్‌లుగా అమ్ముడయ్యాయి.
ప్రీ-బుకింగ్‌ల జోరు చూస్తుంటే ఫ్యాన్స్ ఈ సినిమా కోసం ఎంతగా ఎదురుచూస్తున్నారో అర్ధం అవుతుంది. ఈ జోరు ఎన్నిరోజులు ఉంటుందో చూడాలి.
సాగర్ కె చంద్ర దర్శకత్వం వహించిన ఈ యాక్షన్ డ్రామాలో రానా దగ్గుబాటి మరో హీరోగా నటిస్తున్నాడు . సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి థమన్ సంగీతం అందించగా త్రివిక్రమ్ మాటలు అందించారు.